తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తోందని.. అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.