రోడ్లపై రక్తదాహం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం కుటుంబంలో విషాదం నింపింది. కొత్తూరు పరిధిలోని తిమ్మాపూర్ శివారులో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్… హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నారు. వనపర్తి జిల్లాలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోదరి మమతతో కలిసి వెళ్ళారు చంద్రశేఖర్. అక్కడినించి తిరిగి హైదరాబాద్ వస్తుండగా లారీ రూపంలో విధి వెంటాడింది. కొత్తూరు మీదుగా బైక్‌పై వేగంగా…