Today (18-01-23) Business Headlines: హైదరాబాదులో పెప్సికో విస్తరణ: అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది.