Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్‌నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్‌షిప్‌లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.