చిల్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ నోట్బుక్ విరాళం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ వాలంటీర్లు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీమయ్య, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు నోట్పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నోట్బుక్ విరాళం డ్రైవ్ యువ తరానికి వనరుల విలువ గురించి అవగాహన కల్పించడం , సహాయక వాతావరణంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.…
విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పదవీకాలాన్ని జూలై 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం . లోక్సభ ఎన్నికల కారణంగా విచారణలు నిర్వహించడం వల్ల కమిషన్లు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో పొడిగింపు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న కమిషన్ను ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. జూన్ 30. అయితే, ఏప్రిల్ 7న ప్రారంభించిన…
తిరుమల ఆలయంలో అన్నప్రసాదాల తయారీకి ఆర్గానిక్ బియ్యాన్ని ఉపయోగిం చాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తేల్చి చెప్పింది. సాధారణ బియ్యంతో పాత పద్ధతిని మార్చే ప్రతిపాదన లేదని బుధవారం టీటీడీ ప్రతినిధి స్పష్టం చేశారు , ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు “పూర్తిగా నిజం కాదు” అని అన్నారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు మరుసటి రోజు అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశమై…
ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆర్ఎస్ మాపై అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి…
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ…
తెలంగాణా రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఆరు నెలలు ఐయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టమని, ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పది సంవత్సరాలు పాలించిన BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వ…
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను…
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్…
ఈ ఏడాది సాగర్ కాల్వల ద్వారా సీతారామ నీళ్ళని ఇస్తామని, పాలేరు వద్ద రిజర్వాయర్లతో గోదావరి జలాలు నింపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూడు జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఏడాదన్నరలోపు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రణాళిక లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఒక చుక్క నీరు…