ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అపారమైన ఆదరణ కారణంగా, ప్రపంచంలోని ఇతర క్రికెటర్ల కంటే ఇక్కడి ఆటగాళ్ల బ్రాండ్ విలువ చాలా ఎక్కువ. ఇది కాకుండా.. భారత క్రికెటర్లు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందారు. అయితే బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ క్రికెటర్ల కంటే బాలీవుడ్ స్టార్లు చాలా వెనుకబడి ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని బాలీవుడ్ ప్రముఖులను అధిగమించారు.