ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. “నటుడు సోనూసూద్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.…