ప్రసిద్ధ శైవక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పాతాళ గంగలో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. మెట్ల కిందకు నీటిమట్టం పడిపోవడంతో భక్తులకు నీటికొరత ఏర్పడింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు రోడ్ల మీదే సేద తీరుతున్నారు.…
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే…
నేటి నుండి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షలతో క్షేత్రపరిధిలో 7 రోజులపాటు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18…