ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసు సంచలనంగా మారింది.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. అయితే, ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ జరిపించాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం…