Abortion: ఇంట్లోనే మాత్రలను వినియోగించి అబార్షన్ నిర్వహించడం సురక్షితమని, ఆస్పత్రి భారాన్ని తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు 435 మంది మహిళలపై ట్రయల్స్ నిర్వహించాయి. ఇంట్లో లేదా ఆస్పత్రిలో మిసోప్రోస్టోల్ (వైద్య గర్భస్రావ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మాత్ర)లు తీసుకున్న మహిళల్ని వీరు విశ్లేషించారు.