యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ అభినందన సందేశంలో పేర్కొన్నారు.
బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ కూడా పూర్తయింది.
బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ ఉండి ఉంటే ఆయనకే మళ్లీ పీఠం దక్కి ఉండేదని 'స్కై న్యూస్' కోసం నిర్వహించిన యూగస్ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది.
బ్రిటన్ ప్రధాని రేసులో అందరి కన్నా ముందు వరసలో ఉన్నారు భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్. ప్రధాని పదవీ రేసులో ఇప్పటికే రెండు రౌండ్లను దాటేశాడు. నెమ్మనెమ్మదిగా ప్రధాన మంత్రి పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ అయ్యేందుకు దగ్గరవుతున్నాడు. అన్నీ అనుకూలిస్తే బ్రిటన్ దేశాన్ని భారత సంతతి వ్యక్తి పాలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం రిషి సునక్ తర్వాతి స్థానల్లోనే ఇతర అభ్యర్థులు ఉన్నారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల…
Former finance minister Rishi Sunak cemented his lead over rivals to become Britain's next prime minister on Thursday in an increasingly bitter race to replace Boris Johnson.
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు…
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా ఎవరెన్నిక అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ప్రధాని రేసులో ఉంటానని అందరి కన్నా ముందుగానే ఆయన స్పష్టం చేశారు. తాజాగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి పోటీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం…
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు…
యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా…