Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.