ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్లు అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని వెల్లడించారు.
Traffic Diversion: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాగా ఇవాల్టి నుంచి తెలంగాణ బోనాలు మొదలు కానున్నాయి.
2023 Ashada Masam Bonalu Starts From Today: జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు…
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఏటా రాష్ట్రంలో జరిగే లాల్ దర్వాజ బోనాలు ఆడపడుచుకులు అందంగా ముస్తాబై బోనంతో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు దర్శకులు రెడీగా ఉంటారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఓరేంజ్ లో హైలెట్ అయి దూసుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో…
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి షురూ అయ్యింది. నేడు గోల్కొండ కోట బోనమెత్తింది. బంగారు బోనానికి లంగర్ హౌజ్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెలకు స్వాగతం పలికి.. శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని, ప్రతి ఆలయానికి ఆర్ధిక…
ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నాని ఆయన గుర్తు చేశారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి…
భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందడి షురూ అయ్యింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల జాతర నిర్వాహణ,ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లపై…
సుధారాణి ఈ పేరు హైదరాబాద్ అందులో ముఖ్యంగా పాత బస్తీవాసులకు చాలా సుపరిచితం. బోనాలు, మొహరం పండుగ వస్తే సుధారాణి స్పెషల్ అందులో కనపడుతుంది. సుధారాణి అంటే ఎవరో కాదు బోనాల పండుగ దినం అమ్మవారి ఊరేగింపు, మొహర్రం రోజు బిబికా ఆలం ఊరేగింపు కోసం ఉపయోగించే అంబారి ఏనుగు. హైదరాబాద్ వాసులకు ఎంతగానో సేవలందించిన ఈ సుధారాణి అనే ఏనుగు బెల్గాం జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం మరణించింది. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో…