పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మిలిటరీ గ్రౌండ్‌లో బాంబు కలకలం సృష్టించడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.