భారతీయ సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ను ప్రకటించన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ.. తమ కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. అయితే, ఈ గౌరవాన్ని అందుకోవడానికి ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు. అభిమానులు, సినీ పెద్దలంతా…