వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా? అంటే... అవును... జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 -24 మధ్య వైసీపీ తరపున పవర్‌లో ఉన్న బొల్లా.... ప్రత్యర్థుల్ని గట్టింగానే వేధించారని, ఇక నోటి దురద గురించి అయితే చెప్పేపనేలేదన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు, మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.