Mahindra cars: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ఫలితంగా, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షల్లో డబ్బు ఆదా కాబోతోంది. పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్‌లను చిన్న కార్లుగా చెబుతారు.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా, దాని మధ్య-పరిమాణ SUV XUV700పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం XUV700 ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంది. గత కొన్ని నెలలుగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది.