పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ జనార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్…