ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్‌లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు. దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్…