ప్రయాణికులకు బెంగళూరు మెట్రో షాకిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచింది.
నగరాల ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం సులువు అయిపోయింది.. దూరంతో సంబంధం లేకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.. అయితే.. బెంగళూరులో మెట్రో రైలు సేవలు మరింత తొందరగా ప్రారంభం కానున్నాయి.. మరింత లేట్ నైట్ వరకు సాగనున్నాయి.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతోన్న మెట్రో రైలు సేవలు.. శనివారం నుంచి గంట ముందుగానే.. అంటే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది…