ఏళ్ల నాటి సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతుంది. చింద్వారా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లడీ గేమ్ గోట్‌మార్‌ను మరోసారి ఆడారు. గత వందేళ్లుగా ఛింద్వారాలోని పాంధుర్నాలో పోలా పండుగ రెండో రోజున గోట్‌మార్ ఫెయిర్ నిర్వహిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడి జనాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు.