సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.దీనికి కారణం ఆ సినిమాల కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.కేవలం థియేటర్స్ లోనే కాకుండా మలయాళ సినిమాలు ఓటిటీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా వుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ ఓటిటిలోకి రానుంది.…