పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Tejasvi Surya: బెంగళూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ఈ రోజు జరిగిన పోలింగ్‌లో మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ బెంగళూర్‌లోని జయనగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన…
పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్ ఇచ్చారు. రైల్వేజోన్ భూములు, మాఫీయా ప్రభుత్వం వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద పూస గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ రైల్వేశాఖకు ఇచ్చిన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ బహిర్గతం చేసిన బొత్స….. 2014లో చేతకాని దద్దమ్మ ను ముఖ్యమంత్రిగా పెట్టుకుని మా మీద ఆరోపణలు చేస్తే ఎలా…? అని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో రైల్వే భూములు అడ్డంకులు తొలగించి భూములు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. రైల్వే…