Bandi Sanjay Kumar: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6 గ్యారంటీలు ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా?