తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్‌కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకాకుండా కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే… సహించే ప్రసక్తే లేదు. వేటు తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటరు. వారు పనిచేయరు. పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే…