తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతుండగా టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ శ్రేణులు మద్యం సేవించి యాత్రను…