మోదీ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ వ్యర్ధమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారని బీజేపీ నేత కరుణా గోపాల్ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, మోదీ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో కేటీఆర్ అపోహలు సృష్టించారని విమర్శించారు. నడ్డా అడ్డా ఎర్రగడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని, పారిశ్రామిక వేత్తలకు రాజకీయ అజెండాలు ఉండవని, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ సహకారం తీసుకుని ముందుకు వెళ్తారని…