R Sreelekha: కేరళలో కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది.
Kerala: వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ, ఈ ఎన్నికలకు ముందే అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కు ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముందంజలో ఉంది. ఆరు మున్సిపల్ సంస్థలలో నాలుగింటిలో మరియు 14 జిల్లా పరిషత్‌లలో కాంగ్రెస్ ముందుంది. వామపక్ష ఎల్డీఎఫ్ మాత్రం ఆరింటిలోనే ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు కంచుకోటగా ఉన్న కేరళలో కమలం వికసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…