CP Radhakrishnan: ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఫిక్స్ అయినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత నడ్డా రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1957 మే 4న జన్మించిన ఆయన, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించారు.…