కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ..! అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ది ఐరన్ లెగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు. గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ. అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకొన్నవాళ్లూ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు. దీంతో హైదరాబాద్‌లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు. వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే…
తెలంగాణలో నిరుద్యోగ దీక్షకు దిగింది బీజేపీ. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే.…
రైతుల పాలిట తాలిబన్ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇవాళ హుజురాబాద్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రతి ఓటర్ కు 20 వేల రూపాయలు ఇచ్చిందని… 15 వేల రూపాయలను ఆ పార్టీ కార్యకర్తలే మధ్యలోనే దొబ్బేసారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కాష్ ను నమ్ముకుందని… కాలిబర్, క్యారెక్టర్ ను నమ్ముకుంది బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్…