బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.