కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్యానాలోని సోనేపట్ జిల్లా మదీనా గ్రామంలో రెండ్రోజుల క్రితం వరి నాట్లు వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది కెమెరామెన్‌లు అతన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. అయితే రాహుల్ గాంధీ నాట్లు వేయడంపై బీజేపీ కామెంట్స్ చేస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌లో రాహుల్ గాంధీని హేళన చేస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశారు.