నవతరం తెలుగు సినిమా రచయితల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు బి.వి.యస్. రవి. కొందరు అతణ్ణి ‘మచ్చ’ రవిగానూ పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా పలికే ఈ రచయిత మాటలు కోటలు దాటేలా ఉంటాయి, నిర్మాతల మూటలు నింపేలానూ సాగుతుంటాయి. రవి రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నందమూరి బాలకృష్ణ కోసం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షో కోసం అతను పలికించిన మాటలు ఓ ఎత్తు అని చెప్పవచ్చు. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగిన రవి…