తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి వేకువజామున మూడు గంటల వరకు.. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై కేక్‌లు కట్ చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.