తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని ప్రశ్నించారు. దానికి మనోజ్ స్పందిస్తూ, ‘ఆయన నుంచి ముందుగా నేర్చుకున్న విషయం ఎవరినీ మోసం…