తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ. ”హ్యాపీగా ఉండు..…
డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా వుంటే వరుణ్ సింగ్ గతంలో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చదివిన హర్యానాలోని…
సీడీఎస్ బిపిన్ రావత్‌కు 17 తుపాకుల వందనం సమర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాకుల వందనాల్లో అనేక రకాలు ఉన్నాయి. 21 తుపాకుల వందనం, 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనం వంటివి అనేక రాకాలు ఉంటాయి. వివిధ సందర్బాలను బట్టి, గౌరవాన్ని బట్టి ఈ తుపాకుల వందనం ఉంటుంది. స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటి కోసం తుపాకులు లేదా శతఘ్నలను వినియోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మనదేశానికి…
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులర్పించిన కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎం.ఎం. పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్‌లో ఉందన్నారు. ఇప్పటి వరకు మనకు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సరిహద్దులో ఎదుర్కొంటూ వచ్చాం. గత రెండేళ్లుగా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాల దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందన్నారు. సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు…
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణికి నివాళులర్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వంగా గీత. దీని గురించి ట్విట్టర్ లో తెలుపుతూ… మా పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ తరపున సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు నివాళులర్పించాం. బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబం మొత్తం దేశ సేవలోనే పని చేసింది. బిపిన్ రావత్ తండ్రి కూడా లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు…
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిపిన్ రావత్ సహా ఘటనలో మృతి చెందిన 13 మందికి దేశమంతా నివాళులు అర్పిస్తోంది. బిపిన్ రావత్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విమానయాన శాఖ…
తమిళనాడులోని సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు త్రివిధ దళాలు నివాళులు ఆర్పించనున్నాయి. 8:33 గంటలకు ఎయిర్ చీఫ్ మార్షల్ నివాళులు ఆర్పిస్తారు. ఆ తరువాత 8:36 గంటలకు ఆర్మీ అధికారులు, 8:39 గంటలకు నేవీ అధికారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం 8:45…
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటన అందరినీ కలచివేసింది.. అయితే, అమరులైనవారి పార్థీవ దేహాలను తరలించే మార్గంలో పూల వర్షం కురిపించారు ప్రజలు.. అంబులెన్స్‌లు రాగానే పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.. నీల్‌గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి వారి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెన్నై,ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వివిధ అంశాలు పరిశీలిస్తున్నారు. ఆకాశమార్గంలో రెండు రూట్స్ వున్నా ఎందుకు ఇదే మార్గం బిపిన్ రావత్ బృందం ఎంచుకుందనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాపర్ లో ఎందుకు ప్రయాణం చేసారన్న కోణం లో అధికారుల ఆరా తీస్తున్నారు. సుల్లూరు క్యాంపు నుండి వెల్లింగ్టన్ క్యాంపు రోడ్…