Cyclone Hits Brazil: శీతాకాలపు తుఫాను ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం ఈ తుఫానులో కనీసం 11 మంది మరణించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
బిపర్‌జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది.
బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు బిపర్ జోయ్ తుఫాన్ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.
అరేబియా మహాసముద్రంలో బిపర్‌జోయ్ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
'బిపర్‌జోయ్' తుఫాను ఉత్తర దిశగా పయనిస్తూ గుజరాత్‌లోని పోర్‌బందర్ జిల్లాకు దక్షిణ-నైరుతి దిశలో 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నందున, మత్స్యకారులు లోతైన సముద్ర ప్రాంతాలు, ఓడరేవుల నుంచి తీరానికి తిరిగి రావాలని సుదూర హెచ్చరిక సిగ్నల్ ఎగురవేయాలని సూచించినట్లు అధికారులు గురువారం తెలిపారు.