సిద్ధిపేటలో మంత్రి హరిష్ రావు తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్‌ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడిచెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తడిచెత్తలో వచ్చే సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాల దహనానికి ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సిద్ధిపేటను అన్ని…