సోషల్ మీడియాలో మహిళలకు రక్షణ కరువైంది. ఇది వరకు డీఫ్ ఫేక్ చిత్రాలు, వీడియోలతో ఇబ్బందులకు గురిచేయగా ఇప్పుడు ఎక్స్ లోని గ్రోక్ ను యూజ్ చేసుకుని దారుణాలకు తెగబడుతున్నారు కొందరు నెటిజన్స్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో (ట్విట్టర్‌లో) ప్రస్తుతం ఓ ఆందోళనకరమైన ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ యూజర్లు మహిళల సాధారణ ఫోటోలలో గ్రోక్ AIని ట్యాగ్ చేస్తూ మహిళల దుస్తులను మార్చమని లేదా తీసివేయమని దానికి సూచిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, మస్క్ AI ఈ…