AICC Holds Introspection Meeting: బీహార్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా “ఏఐసిసి” అధిష్ఠానం ఆత్మశోధన నిమిత్తం సమావేశం నిర్వహించింది. “ఏఐసిసి” అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్ర నేత రాహుల్ గాంధీ తోపాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ అంశంపై గంటకు పైగా సమాలోచనలు కొనసాగాయి.. సమావేశంలో వాడి వేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి, ప్రధాని మోడీ చేసిన తీవ్ర విమర్శలు నేపథ్యంలో…