ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.