Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.