తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనియా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని మంథనికి చెందిన ఆమె, యాంకర్‌గా, ఆర్జీవీ నుండి సినిమాల్లో నటిగా మారింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, కొన్ని కారణాల వల్ల తొందరగా ఎలిమినేట్ అయినప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంటర్ అయిన సమయంలోనే సోనియా తన ప్రియుడు యశ్ గురించి చెప్పింది. షో పూర్తయ్యాక కొద్ది నెలల్లోనే…