బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు శనివారం నాగార్జున క్లాస్ పీకడం కొన్ని వారాలుగా కామన్ అయిపోయింది. వరెస్ట్ పెర్ఫార్మర్ ఎంపికతో పాటు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరుగుతున్న వాదోపవాదాలను కూల్ చేయడానికి, తప్పు చేసిన వారికి ఆ విషయాన్ని సూటిగా చెప్పడానికి నాగార్జున కాస్తంత ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. శనివారం కూడా అదే జరిగింది. హౌస్ లోని ఒక్కో మెంబర్ ఫోటోనూ క్రష్ చేస్తూ, వారి ప్లస్ పాయింట్స్, మైనెస్ పాయింట్స్ చెబుతూ…