Amazon layoffs 2026: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించనుంది. వచ్చే వారం నుంచే కంపెనీ రెండో విడత ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. మొత్తం మీద సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబర్‌లోనే అమెజాన్ దాదాపు 14 వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు జరగబోయే ఈ రెండో విడతలోనూ…