పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు.
రాబోయే 3 సంవత్సరాల్లో జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం పార్లమెంట్‌లో నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.