కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం కూలీ పనికి వెళుతున్న వారిని మృత్యువు కబలించింది. కూలీలు వెళుతున్న ఆటోరిక్షాను ట్రక్కు ఢీ కొనడంతో 7మంది అక్కడికక్కడే మరణించగా.. 11 మందికి గాయాలయ్యాయి. రోజూలాగా శుక్రవారం అర్థరాత్రి ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.