ఉమ్మడి రాష్ట్రంలో భువనగిరి కీలక నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి అడ్డా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత భువనగిరిలో టీఆర్ఎస్‌దే రాజ్యం. వరస ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు కంచుకోట నియోజకవర్గాల్లో ఒకటి. కాకపోతే 2018 ఎన్నికల తర్వాత భువనగిరి రాజకీయ ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. భువనగిరిలో పట్టున్న ఎలిమినేటి కుటుంబం టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ఆ కుటుంబానికి అస్సలు పడటం లేదు. ఇంతలో…