ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొప్పించేవారు. అందువల్లే ఎస్వీకే సినిమాను చూడటానికి అప్పట్లో ఆబాలగోపాలం పరుగులు తీసేవారు. పాతికేళ్ళ క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆహ్వానం’ కూడా జనాన్ని అలాగే అలరించింది. 1997 మే…
పాటకు పల్లవి ప్రాణం అన్నట్టుగానే తెలుగు సినిమాలకు పాటలు ఆయువు. ముఖ్యంగా టాప్ హీరోస్ మూవీస్ కు పాటలు మరింత ప్రాణం. టాప్ స్టార్స్ ఫిలిమ్స్ జనాన్ని ఆకర్షిస్తాయి, అందులో సందేహం లేదు. అయితే మరింతగా ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా అలరించే పాటలు ఉండి తీరాలి. లేదంటే సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ లో తేడా కనిపించక మానదు. అందుకనే తెలుగు చిత్రసీమలో సినీజనం పాటలకు పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఎందరో గీతరచయితలు తమదైన బాణీ పలికిస్తూ తెలుగువారిని…