శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది